ఇలా ఎంతో మంది కామాంధుల బారినపడి బలవుతూనే ఉన్నారు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు నీచుడు. చివరికి బాలికను గర్భవతిని చేశాడు. ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన విజయవాడ నగరం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరం కొత్తూరు తాడేపల్లి లంబాడి తండ లో నివాసం ఉంటున్న 14ఏళ్ల బాలికపై.. అదే వీధిలో ఉంటున్న బాణావత్ ప్రసాద్ కన్నేశాడు.
ఈ క్రమంలోనే ఇక మాయమాటలతో సదరు బాలిక తో పరిచయం పెంచుకున్నాడు. ఇక చివరికి మాయ మాటలతో నమ్మించి ప్రేమ పేరుతో యువతి దగ్గరై పెళ్లి పేరుతో మూడేళ్లుగా శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవలే బాలిక శరీరంలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో బాలిక అసలు విషయం బయట పెట్టింది. ఇక బాలికను ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భవతి అని తేలింది దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి