అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏకగ్రీవాలా సంఖ్య తగ్గినప్పటికీ.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలు మొత్తం ఎక్కువగా వైసీపీ పార్టీకి అనుకూలంగా కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవాలకు బ్రేక్ వేయడంతో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి.అయితే కర్నూలు జిల్లాలో మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఏకగ్రీవాలు ఆపలేకపోయారు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని జిల్లాలలో మొత్తం గ్రామ పంచాయతీ లో 20 శాతం కంటే తక్కువగానే ఏకగ్రీవాలు అయితే కర్నూలు జిల్లా 199 పంచాయతీలకు గాను.. వేగంగా 54 పంచాయితీలు ఏకగ్రీవాలు కావడం సంచలనం గా మారిపోయింది.
ఇలా ఏకగ్రీవాలు ఆపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నించినప్పటికీ చివరికి.. నిమ్మగడ్డ వ్యూహం మాత్రం ఫలించలేదు అన్నది అర్థం అవుతుంది. కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు అందరూ రంగంలోకి దిగి.. ప్రతి గ్రామపంచాయతీలో కూడా ఏకగ్రీవాలు జరిగే విధంగా పావులు కదుపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏకగ్రీవాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నూల్ రాజకీయం కాస్త మరింత రసవత్తరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి