ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు ఇంటర్ నెట్ ఓ నిత్యావసరంగా మారింది. కొన్ని దేశాల్లో ఇంటర్ నెట్ అనేది ఓ ప్రాధమిక హక్కుగా మారింది. అలాంటి ఇంటర్ నెట్ ఇంకా మన దేశంలో పల్లెలకు దూరంగానే ఉంది. పల్లెల్లో నెట్ అందుబాటులో ఉన్నా.. ఒకటో రెండో సెంటర్లలో నెట్ ఉంటోంది. కానీ.. ఇప్పుడు జగన్ సర్కారు మరో వరం ప్రకటించింది.

అదేంటంటే.. వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించాలని నిర్ణయించింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి వై.య‌స్. జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలని అన్నారు. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందని, ఇందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ- లైబ్రరీ కోసం భవనం కూడా కట్టాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తెలిపారు.

ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీలో అంశాలపైనా సమగ్రంగా చర్చించిన సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: