సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. దేశ చట్టాలను గౌరవించాలి. కానీ పార్లమెంట్‌లో చట్టాలు చేసే ఓ ఎంపీనే చట్టాన్ని ఉల్లంఘించాడు. సభ్య సమాజం ఏ మాత్రం అంగీకరించని పని చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయుసున్న ఆ ఎంపీ.. 14 బాలికను పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్‌ ఎంపీ మౌలానా సలావుద్దీన్ ఆయుబి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

జమైతేఉలేమా ఇ ఇస్లాం నేత,  పాకిస్తాన్‌ ఎంపీ మౌలానా సలాఉద్దీన్‌ అయూబి 14 ఏండ్ల బలూచిస్తాన్‌ బాలికను పెండ్లి చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మైనర్‌ బాలికతో ఎంపీ వివాహంపై పాకిస్తాన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్రాల్‌లో మహిళా సంక్షేమ రంగంలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్‌ చట్టాల ప్రకారం 16 ఏండ్లలోపు బాలికలతో వివాహాలను అనుమతించారు. బలూచిస్తాన్‌ ఎంపీ తన కంటే నాలుగు రెట్లు చిన్న వయసు కలిగిన బాలికను వివాహం చేసుకున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని స్వచ్ఛంద సంస్థ దావతోఅజీమట్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక జుగూర్‌లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని, రికార్డుల ప్రకారం బాలిక 2006 అక్టోబర్‌ 28న జన్మించినట్టు తెలిసిందని డాన్‌ పత్రిక పేర్కొంది. ఎంపీతో వివాహంపై ఫిర్యాదు ఆధారంగా బాలిక గృహాన్ని ఇటీవల పోలీసులు సందర్శించగా తమ కుమార్తెకు పెండ్లి కాలేదని ఆమె తండ్రి వెల్లడించారని తెలిపింది. మరోవైపు బాలికతో ఎంపీ నిఖాను పక్కా చేసుకున్నారని, వివాహ వేడుక ఇంకా జరగలేదని పాక్‌ అబ్జర్వర్‌ పేర్కొంది.

అందుకే ఎంఎన్‌పీ ఆయుబిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఇటీవలే బాలిక నివసిస్తున్న గ్రామాన్ని సందర్శించామని.. తమ కూతురికి పెళ్లి జరగలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరు స్థానికులు మాత్రం బాలికకు పెళ్లి జరిగిందని.. మైనారిటీ తీరిన తర్వాతే కాపురానికి పంపిస్తామని ఆమె తండ్రి పోలీసులకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: