చైనా ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు చర్చనీయాంశం గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాలో మైనార్టీలుగా ఉన్న వీగర్  ముస్లింల విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  పైపైకి అన్ని దేశాల పై విమర్శలు చేస్తూ ఉంటుంది చైనా. మతస్వేచ్ఛ భావప్రకటన స్వేచ్ఛ ప్రతి దేశంలో ముఖ్యం అని చెబుతోంది. కానీ తమ దేశంలో మాత్రం వీగర్  ముస్లింల విషయంలో మత స్వేచ్ఛ కాదు కదా కనీసం జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తుంది.



 ఇప్పటికే చైనాలో ఉన్న వీగర్ ముస్లింల ప్రార్ధనా మందిరాలు అన్నింటినీ మూసి వేయించి ఎవరు కూడా ప్రార్థన మందిరాలు కి వెళ్ళకూడదు అంటూ నిబంధన పెట్టింది.అంతేకాకుండా ఇక ముస్లింలు చైనీస్ భాష మాత్రమే నేర్చుకోవాలి అంటూ మరో నిబంధన కూడా పెట్టింది... అంతే కాకుండా ఇక ఈ మధ్య కాలంలో అయితే వీగర్ ముస్లింలు అందరూ కూడా మతం  మార్చుకోవాలి అంటూ ప్రస్తుతం ఒత్తిడి తీసుకు వస్తుంది చైనా.  ఈ క్రమంలోనే చైనా తీరుపై ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి.



 చైనా నుంచి సహాయం పొంది మిత్ర దేశాలు గా కొనసాగుతున్న కొన్ని దేశాలు సైతం ప్రస్తుతం చైనా తీరును తప్పు బడుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే అమెరికా యూరోపియన్ యూనియన్ అజర్బైజాన్  ఇలా అన్ని దేశాలు కూడా చైనా తీరును తప్పు బడుతున్నాయి. తీరు మార్చుకోవాలి అంత సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో దేశం కూడా చైనా తీరు మార్చుకోవాలి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో చైనా పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.  రానున్న రోజుల్లో వీగర్  ముస్లింల విషయంలో చైనా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరం గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: