తాజా సమాచారం ప్రకారం షియోమి 200W చార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు షియోమి కసరత్తులు చేస్తుంది. అది కూడా ఫ్లాగ్ షిప్ ఫోన్ల మాదిరిగానే అల్ట్రా మోడల్ వేరియంట్ లాగే ఉండవచ్చని సూచిస్తుంది. అంటే 200w చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే మొబైల్ కు కేవలం 5 నిమిషాలు చారింగ్ పెడితే సరిపోతుంది. ప్రస్తుతం షియోమి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఫాస్ట్ చార్జింగ్ ను అందిస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి 65w ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా షియోమి యొక్క Mi 10 ఎక్స్ ట్రీమ్ కొమ్మమరేటివ్ ఎడిషన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 55W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వుంది. ఇప్పటికే 120W ఛార్జర్ ను వివో iqoo7 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా.. రియల్ మీ 125w ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోచేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను షియోమి త్వరలోని ప్రకటించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి