ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్  అందే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మొదట కరోనా  వైరస్  క్లిష్ట సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్  అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ టీకా  వేయించుకుని ఏకంగా 60 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సిన్  వేసుకునేందుకు పిలుపునిచ్చారు అనే విషయం తెలిసిందే.




 ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ లో భాగం గా అటు బ్యాంకు ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు కూడా వ్యాక్సిన్   తీసుకునేందుకు సిద్ధ మయ్యారు. అయితే ఆయా బ్యాంకులు తమ తమ బ్యాంకు ఉద్యోగులందరికీ కూడా వ్యాక్సిన్ అందించడం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.  ఇక ఇటీవల తమ ఉద్యోగులకు అందరికీ వ్యాక్సినేషన్ విషయంలో ప్రముఖ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసిఐసిఐ కీలక నిర్ణయం తీసుకుంది.



 తమ ఉద్యోగుల వ్యాక్సిన్ ఖర్చు మొత్తం తామే భరిస్తామని అంటూ ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగులు ఐసిఐసిఐ బ్యాంకు లో పని చేస్తున్నారని ఇక ఉద్యోగుల తో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్  అందించడానికి సంబంధించిన ఖర్చులు తామే భరిస్తామని అంటూ ఐసిఐసిఐ తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సిన్  రెండు డోసులు  యాక్షన్ కు సంబంధించిన ఖర్చు మొత్తం తామే భరిస్తామని అంటూ ఇటీవలే ప్రకటించింది.  కరోనా సమయంలో తమ ఉద్యోగులను  కాపాడు కోవడం తమ  బాధ్యత అంటూ తెలిపింది ఐసిఐసిఐ బ్యాంక్.

మరింత సమాచారం తెలుసుకోండి: