అంతేకాదు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తు ఇక ఎక్కడికక్కడ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసి మట్టు పెడుతుంది భారత సైన్యం. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మన దేశ సరిహద్దుల్లో కి అడుగుపెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అనే విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు భారత సైన్య అప్రమత్తం గా ఉంటున్నారు. వివిధ రకాల ఆపరేషన్లు చేపడుతూ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మన దేశం లోకి రావడానికి ఉగ్రవాదులు ఏర్పరుచుకున్న సొరంగాలను కూడా గుర్తించి వారి ఆటలు కట్టిస్తున్నారు.
ఇక ఇటీవలే మరో ఉగ్ర కుట్ర భగ్నం చేసిన సరిహద్దు దళాలు ఇక ఉగ్రవాది దగ్గర నుంచి చైనాకు సంబంధించిన ఆయుధాలను చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్లోని దొడ్డ జిల్లాలో సిఆర్పిఎఫ్ జవాన్లు ఎస్ ఎస్ బి, సైన్యం పోలీసులు కలిసి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పిర్దౌస్ అహ్మద్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి మూడు చైనా తుపాకులు మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. అయితే ఇలా ఉగ్రవాదులకు సహాయం చేసే వారికి కూడా కఠిన శిక్షలు తప్పవు అంటూ హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి