టీవీ9.. సంచలన వార్తలకు మారుపేరుగా నిలిచిందీ పదం. న్యూస్ ఛానల్ అంటే టీవీ9నే అనేంతగా పేరు సంపాదించింది. దీని తర్వాత వచ్చిన అనేక ఛానళ్లు.. టీవీ9 తరహాలో దూసుకుపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఆ ప్లేస్ తన్నుకుపోవాలని ప్రయత్నించాయి. కానీ ఇప్పటికీ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9నే నెంబర్ వన్. దాని పేరే దానికి ఓ బ్రాండ్ ఇమేజ్. 

అలాంటి టీవీ9 ఇప్పుడు కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టేసింది. టీవీలకు యాడ్లు చాలా అవసరం.. అలాగే సినిమాలకు పబ్లిసిటీ  కూడా చాలా అవసరం. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ కొత్తబిజినెస్ కు టీవీ9 శ్రీకారం చుట్టింది. సింపుల్ గా చెప్పాలంటే సినీరంగంలోకి టీవీ9 అడుగు పెట్టేసింది. నిర్మాత మధుర శ్రీధర్ తో కలిసి ఓ చిత్రం నిర్మించబోతోంది. 

మధుర శ్రీనివాస్, టీవీ9 సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించబోతున్నాయి. దీనికి దర్శకుడుగా రామరాజుని ఎంచుకున్నారు. ఈయన గతంలో మల్లెల తీరంలో అనే చిత్రంతో క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సినిమా పెద్దగా ఆడకపోయినా దర్శకుడికి మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం యూత్ లో ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్ తెచ్చుకుంటున్న రాజ్ తరుణ్ ని  హీరోగా ఎందుకున్నారని తెలుస్తోంది. 

గతంలో వంశీ తీసిన లేడీస్‌ టైలర్‌ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అని తెలుస్తోంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా చిత్రాలతో ప్రేక్షులకు చేరువయిన రాజ్‌తరుణ్‌.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీడియా రంగంలో టీవీ చెప్పుకోదగిన విజయాలే సాధించింది. కానీ తన గ్రూప్ లోని మరో ఛానల్ ను సక్సస్ బాట పట్టించలేకపోయింది. మరి సినిమా రంగం టీవీ9 కు ఎలాంటి అనుభవం మిగల్చనుందో మరి..!?


మరింత సమాచారం తెలుసుకోండి: