కొందరికి రాజకీయ నేతలకు అంటే ఎనలేని అభిమానం ఉంటుంది. వాళ్ళు ప్రజలకు చేసే సేవలకు చాలా మంది అభిమానులుగా మారతారు. అలాంటి నేతల కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటారు. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రజల అభివృద్ది కోసం ఆయన తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ నచ్చడం తో ఆయన పాలన ఎప్పటికీ  కొనసాగించాలని అనుకుంటారు. అతని పై అభిమానం తో ఓ రైతు ఏకంగా తన పొలాన్ని ఉచితంగా ఇచ్చి తన అభిమానాన్ని చూపించాడు.


వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు నారాయణ రెడ్డికి 80 సెంట్లు భూమి ఉంది. ఆయనకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానం. సీఎంగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ సచివాలయం నిర్మించేందుకు రూ.10 లక్షల విలువైన 6 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.. సచివాలయం గ్రామం లో ఉంటే గ్రామస్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించాడు.


ఈ విషయం పై రైతు తన భూమికి సంబంధించిన భూ పత్రాలను నిన్న  అధికారులకు అందజేశారు.పెద్దమ్మను ఒప్పించి వెల్‌నెస్‌ సెంటర్‌కు స్థలం మేరుగు నారాయణరెడ్డి తన స్థలాన్ని సచివాలయానికి ఇవ్వడంతో పాటు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే 'వెల్‌నెస్‌ సెంటర్‌'కు తన పెద్దమ్మ మేరుగు కామమ్మకు చెందిన రూ.25 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని కూడా ఇచ్చేలా ఆమెను  ఒప్పించారు. కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు.. ఇలా చాలా మందికి జగన్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ది పనుల గురించి చెప్తూ వారి నుంచి ప్రభుత్వానికి సహకారం కావాలని కోరుతున్నాడు.. అతని ఉదార స్వభావం పై సీఎం కూడా అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: