అయితే.. సామాజిక వర్గాల పరంగా తన పార్టీని, తనను కూడా కట్టేయొద్దంటూ.. నిన్న మొన్నటి వరకు కూడా పవన్ ప్రకటించుకున్నారు. తాను అందరి వాడినని.. ఒక కులానికే పరిమితం చేయొద్దని కూడా ప్రకటించుకున్నారు. అయితే. ఆయన అలా ప్రకటించుకున్నా.. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం మాత్రం జనసేన వైపు నడుస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో.. గ్రామ పంచాయతీ.. స్థానిక సంస్థలు, పురపాలిక, కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన వైపు చాలా మంది కాపులు నిలబడ్డారు.
దీంతో ఇప్పుడు కూడా వీరికి అండగా నిలబడకపోతే.. వచ్చే ఎన్నికల నాటిని ప్లేట్ చిరిగిపోవడం ఖాయమని జనసేన గుర్తించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాపులు ఎక్కువగా తూర్పు గోదావరిజిల్లాలో సభలకు సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. తాజాగా రోజులులో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్.. ఇక నుంచి అందరినీ కలుపుకొని వెళ్తామని ప్రకటించారు.
దీని వెనుక కాపులకు అవకాశం ఇవ్వడం.. కాపులకు అనుకూలంగా వ్యవహరించడం అనే కాన్సెప్ట్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇదే కనుక వర్కవుట్ అయితే.. ఖచ్చితంగా జనసేన పుంజుకోవడం ఖాయమే. అయితే.. కాపులకు మరింత భరోసా ఇవ్వాల్సిన అవసరం.. వారి డిమాండ్లను సానుకూలంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాపు సోదరులారా.. రండి.. ఉద్యమించండి..!
రాష్ట్రంలో కాపు సోదరులు.. రాజకీయ పార్టీలకు ఆటవస్తువుగా మారిపోయారనడంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజర్వేషన్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మరికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫలితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నప్పటికీ.. వారి నిజమైన కోరికలు.. డిమాండ్లు.. ఎక్కడివక్కడే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన గళం ద్వారా కాపుల సమస్యలను, డిమాండ్లను అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయ నేతలకు వినిపించేందుకు నడుం బిగించింది https://www.indiaherald.com/కాపు సామాజిక వర్గం సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు https://www.indiaherald.com/ నిర్ణయించింది.
కాపు సోదరులు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..! మీ తరఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్యమంలో ప్రతి కాపు సోదర, సోదరీమణులకు భాగస్వామ్యం కల్పిస్తోంది https://www.indiaherald.com/
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి