గత కొన్నేళ్లుగా టీడీపీ డామినేషన్ ఉన్న విజయవాడ నగరంపై వైసీపీ పట్టు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడని వైసీపీ సొంతం చేసుకుంది. ఏపీ విడిపోయాక విజయవాడపై టీడీపీకి పట్టు దక్కింది. 2014, 2019 ఎన్నికల్లో నగరంలో టీడీపీ మంచి ఫలితాలు సాధించింది.

అలాగే టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్‌లో సైతం విజయం సాధించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపీకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నా సరే గెలుపు వైసీపీకి దక్కింది. అయితే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, నగరంలో గెలుపు సులువైంది. అలాగే అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు నిత్యం కష్టపడి వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. టీడీపీలో ఉన్న లుకలుకలు, వైసీపీకి మరింత అడ్వాంటేజ్ పెంచాయి.

అటు వైసీపీ నేతలు ఐకమత్యంగా ముందుకెళ్లి టీడీపీని ఓడించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూరు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌లు విజయవాడ నగరంపై వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. అయితే మరీ ముఖ్యంగా అవినాష్ వైసీపీలోకి వచ్చాక విజయవాడలో పరిస్థితులు మారాయి. ముందు వరకు నగరంలో టీడీపీకే అనుకూలంగా ఉండేది. ఎప్పుడైతే అవినాష్ టీడీపీ వీడి, వైసీపీలో చేరారో, అప్పటినుంచి తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టు దక్కింది.

తూర్పులో దేవినేని వర్గం బలంగా ఉంది. పైగా అవినాష్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు ముందే ఉన్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి మరీ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా తూర్పులో సైతం వైసీపీకి ఎక్కువ డివిజన్లు వచ్చాయి. మొత్తానికైతే అవినాష్ ఎంట్రీ వైసీపీకి బాగా ప్లస్ అయింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్ తూర్పు నుంచి గెలవడం ఖాయమని తెలుస్తోంది. 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్, నెక్స్ట్ మాత్రం విజయవాడ తూర్పులో గెలుపు పక్కా అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: