ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ నుంచి ఇటీవల సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణను వెళ్లగొట్టారన్న వార్త ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై సదరు వెంకటకృష్ణ వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇది విరామమే అన్న సంగతి ఆయనా ధ్రువీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. రెండు, మూడు రోజుల్లోనే మళ్లీ వెంకటకృష్ణ ఏబీఎన్ తెరపై ప్రత్యక్ష మయ్యారు. ఈ అంశంపై నిధి యూట్యూబ్ ఛానల్ ఒకటి, రెండు వీడియోలు ప్రసారం చేసిందట.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఉద్యోగి వెంకటకృష్ణతో గొడవపడి ఆయనను తొలగించారని... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తిత్వంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారని ఈనెల 25, 26 తేదీల్లో నిధి టీవీ రెండు కథనాలను ప్రసారం చేసిందట. అయితే ఇవి అసత్య కథనాలు అంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్‌ చానల్‌ నిధి టీవీ పై ఏబీఎన్  ప్రతినిధి వి.మురళి డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఉద్యోగి వెంకటకృష్ణతో గొడవపడి ఆయనను తొలగించారని... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తిత్వంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారన్న ప్రచారం పూర్తిగా అభూత కల్పనలని... ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి  ప్రతిష్ఠను, ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇమేజ్‌ని దెబ్బతీయడానికే ఇలాంటి కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  కొందరు వ్యక్తులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఏబీఎన్ ప్రతినిధి వివరించారు.

అంతే కాదు.. దీన్ని అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణించి, నిధి యూట్యూబ్‌ చానల్‌పై విచారణ జరిపి, సత్వరమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారట. ఆ చానల్‌ ప్రసారం చేసిన కథనాల వీడియో క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారట. అయితే ఈ ఫిర్యాదు ఈనెల 26నే చేశారట. ఫిర్యాదును స్వీకరించినట్టు డీజీపీ కార్యాలయం మంగళవారం సమాచారం పంపిందట. అంతే కాదు.. నిధి టీవీ యూట్యూబ్‌ చానల్‌కు లీగల్‌ నోటీసు కూడా పంపిస్తారట.


మరింత సమాచారం తెలుసుకోండి: