ఒక వేళ కేంద్రం చెబుతున్నట్లు హై కోర్ట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కూర్చుని మాట్లాడుకుని తరలించుకుంటే...రేపు ఏదైనా సమస్య రాకుండా ఉంటుందని గ్యారంటీ ఉందా...? రేపు ఎవరైనా న్యాయవాదులు కానీ లేదా వేరెవరైనా కేసులు వేస్తే పరిస్థితి ఏంటి...? ఆ కేసులు సుప్రీం కోర్టుకి వెళితే ఎప్పుడేమి చెయ్యాలి...? ఇలా పలు సందేహాలు నెలకొన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది. ఇది ఇలా ఉంటే అసలు కర్నూలులో హై కోర్ట్ ఏర్పాటు విషయాన్ని బీజేపీనే తమ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టింది. అలాంటప్పుడు ఈ విధంగా ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది రాజకీయ ప్రముఖులు విమర్శిస్తున్నారు. మరి వీటన్నింటికీ అటు కేంద్రంతో పాటు బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి