మొన్నటి మొన్న చంద్రబాబు ఏం చెప్పారు. ఏపీలో జరిగే పరిషత్ ఎన్నికలను బహిష్కరించేస్తున్నామన్నాడు.. జగన్ సర్కారు అరాచక ప్రవర్తన వల్ల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ తీరుపై నమ్మకం లేదని, ఎన్నికల కమిషనర్ ఒక రబ్బర్ స్టాంప్ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీరి ఎన్నికల నిర్వహణపై నమ్మకం లేదని, ఆమె రబ్బర్ స్టాంప్ కమిషనర్ అని అందువల్ల తాము ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.

కానీ.. చంద్రబాబు మాటలను పార్టీ క్యాడర్ ఏమాత్రం పట్టించుకున్నట్టు లేరు. చాలా చోట్ల వారు వైసీపీతో పోటీ పడ్డారు. అనేక చోట్ల వైసీపీ- టీడీపీ నేతల మధ్య గొడవలు జరిగాయి. కొన్నిచోట్ల పోలింగ్ నిలిచిపోయింది కూడా. చివరకు 515 జెడ్పిటిసి, 7220 ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిశాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్ లో తప్పిదాలు, ఘర్షణలు ఇతర కారణాల వల్ల రీపోలింగ్ కూడా పెట్టాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లా చౌట భీమవరం లో ఎంపిటిసి స్థానంలో 13/6 పోలింగ్ స్టేషన్  తలెత్తిన ఘర్షణలు వల్ల పోలింగ్ కు ఆటంకం ఏర్పడింది. ఇవాళ పోలింగ్ పెడుతున్నారు.

ఇంకా పలుచోట్ల టీడీపీ- వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. అంటే దీని అర్థం ఏంటి.. చంద్రబాబు ఏం చెప్పినా.. సరే.. క్షేత్రస్థాయిలో ఎన్నికలకు దూరంగా ఉండటం అసాధ్యం అని నాయకులు చెప్పినట్టే కదా.. మరి ఈ మాత్రం ఆలోచన చంద్రబాబుకు లేకుండా పోయిందా అన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. అనవసరంగా చంద్రబాబు బహిష్కరణ పిలుపు ఇచ్చి తప్పు చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని..తమ వాళ్లు పోరాడినా, కేసులు పెట్టరని, గెలిచినా ఓడినట్లు ప్రకటిస్తారని అందుకే తమ పార్టీ లో చర్చించి ఎన్నికలలో పాల్గొనరాదని నిర్ణయించామని చంద్రబాబు మొన్న తెలిపారు. అంతే కాదు.. పోటీచేసిన అభ్యర్దులతో మాట్లాడామని మండల పార్టీ నేతలతో కూడా మాట్లాడానని ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అలా మాట్లాడిన నేతలే ఎన్నికల్లో పాల్గొన్నారు. పాపం.. చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: