ఇకపోతే ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించిన అభ్యర్థులందరూ భవితవ్యమేమిటో తేలేందుకు సమయం ఆసన్నమైంది ఇక లోక్ సభ నియోజక వర్గ ఉప ఎన్నికకు అంతా సిద్ధం అయింది ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చిత్తూరు జిల్లాలోని మూడు నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు 2470 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 17 లక్షల 10 వేల ఆరు వందల 99 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యం లో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లు అందరూ కూడా కరోనా మార్గ దర్శకాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్ లేని వారికి ప్రవేశాన్ని నిషేధించారు అధికారులు. శానిటైజర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఓటు వేసేందుకు వచ్చేవారు ఇక భౌతిక దూరం పాటించే విధంగా పలు సూచికలు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించే విధంగా పలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధ మయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి