పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాజకీయాలు మొత్తం వాడివేడిగా మారిపోయాయ్.  ఇక మూడు విడుతలకు సంబంధించిన పోలింగ్ పూర్తి కాగా.. మరో రెండు విడతల పోలింగ్ మిగిలి ఉండడంతో ఇక అన్ని పార్టీలు కూడా ఈ మిగిలి ఉన్న రెండు విడుతలలో కూడా ప్రజలందరినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభ లు నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి రోజురోజుకు మరింత రాజుకుంటుంది.  ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.



 మరోసారి పశ్చిమబెంగాల్లో అధికారాన్ని చేపట్టాలని తృణమూల్ కాంగ్రెస్..  ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో ఈ సారీ అధికారంలోకి రావాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. రాజకీయాలలో ఇది సర్వ సాధారణమే అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తు ఉండటం మాత్రం ప్రజలను భయపెడుతుంది .  అటు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ప్రజలందరిని ఆందోళన కలిగిస్తోంది.  ఎన్నికల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు అని కొన్ని విమర్శలు కూడా తెర మీదకు వస్తున్నాయి.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం మరికొన్ని ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. పాదయాత్రలు రోడ్షోలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే కేవలం 500 మందితో మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే పశ్చిమబెంగాల్లో భారీ బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్లు గా అటు బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రకటించాయ్.. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం భారీ బహిరంగసభకు సిద్ధమవుతుంది అయితే ఇటీవలే మోడీ తన భారీ బహిరంగ సభ రద్దు చేసుకున్న కాసేపటికే ఈసి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారిపోయింది. ఈసీ ఆదేశాలతో మమత కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: