ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జర్నలిస్టుల ప్రాణాలు కాపాడండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో జర్నలిస్ట్ లకు అక్రిడేషన్స్ లేవు.. హెల్త్ కార్డ్స్ లేవు.. ఆరోగ్య బీమా.. ప్రమాద బీమా లేవు.. గత రెండేళ్లుగా కనీసం గుర్తింపు కూడా లేదు.. అయినా వృత్తి పట్ల ఉన్న మక్కువ తో ఏళ్ళ తరబడి జర్నలిస్ట్ లు గానే బతుకు బండి సాగిస్తున్నారు.. ఇంట్లో పెళ్ళాం పిల్లలకు సరైన కూడు కూడా పెట్టలేక పోయినా..బయట దొరికే దొంగ నమస్కరాలతో అదే జీవితం అనుకుని బతికేస్తున్న దౌర్భాగ్య జీవితాలు జర్నలిస్ట్ లవి.
ఎలాగోలా బతుకు బండిని లాగుతున్న జర్నలిస్ట్ ల పాలిట కరోనా శాపంగా మారింది.. మంత్రులు.. ముఖ్య మంత్రులు.. అధికారులు.. ప్రోగ్రామ్స్ ను వారికంటే ముందుగా వెళ్లి గంటల తరబడి వేచి వుండి కవరేజ్ ఇచ్చే జర్నలిస్ట్ కు బతుకు కవరేజ్ కి గ్యారంటీ లేకుండా పోయింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కూడా జర్నలిస్ట్ లను గుర్తించడం లేదు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే భరోసా కూడా జర్నలిస్ట్ లకు లేదు. కనీసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందించే ఆలోచన కూడా లేదని పాత్రికేయులు వాపోతున్నారు.
పరుగులు పెట్టి.. పోటీ పడి న్యూస్ కవర్ చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న జర్నలిస్టులు కరోనా కాటుకు బలి అవుతున్న కనీసం స్పందన లేదని జర్నలిస్టులు వాపోతున్నారు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు రక్షణ..ఆదరణ అసలే లేదు..పాలకులారా.. మావైపు చూడండి.. ఏళ్ళ తరబడి మీకు సేవలు అందించిన జర్నలిస్ట్ లను కాపాడుకోండి.. గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి జర్నలిస్ట్ ల బాధలు తీసుకు వెళ్లి ప్రాణాలు కాపాడండి.. అని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి