ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోన్న క్రమంలో డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. మోసగాళ్ళు కొత్త మార్గాల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి మోసగాళ్ళు లైఫ్ సేవింగ్ మెడిషన్స్‌పై ఆఫర్లంటూ ప్రకటించొచ్చని, ఈ ఆఫర్లను నమ్మితే మోసపోవాల్సి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. అందుకే ఎస్బీఐ తమ ఖాతాదారులను కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు బ్యాంకుల రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టైంలో ఇల్లు రావడానికి కొందరు భయపడుతుంటే మరికొందరు బ్యాంకు లావాదేవీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరైతే బ్యాంకులకు వచ్చి మధ్యలో కరోనా భారిన పడుతున్నారు.


ఇటువంటి సమయంలో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ ఖాతాదారులను ఇబ్బందులు కలిగించకుండా చేసింది. నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని బ్యాంక్ ఖాతాదారులను కోరవద్దని ఎస్‌బీఐ అన్ని బ్యాంక్ బ్రాంచులకు ఆదేశాలు పంపింది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు చెప్పినట్లు అయ్యింది.


కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే అకౌంట్ పనిచేయదు. కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోయినా కూడా మే 31 వరకు బ్యాంక్ ఖాతాలను పాక్షికంగా స్తంభించవద్దని బ్యాంక్ బ్రాంచులకు ఎస్‌బీఐ తెలియజేసింది. అవసరం అనుకుంటే పోస్ట్ లేదా రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ద్వారా కస్టమర్లు పంపిన వివరాల ప్రాతిపదికన కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. బ్యాంకులు సాధారణంగానే బ్యాంక్ కస్టమర్లను కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతుంటాయి. లో రిస్క్ ఉన్న కస్టమర్లను పదేళ్లకు ఒకసారి కేవైసీ కోరతాయి.


మీడియం రిస్క్ ఉన్న కస్టమర్లను 8 ఏళ్లకు ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కోరతాయి. అదే హైరిస్క్ ఉన్న కస్టమర్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతుంటాయి. అందులో భాగంగానే తమ కస్టమర్లకు ఎస్బీఐ అప్రమత్తం చేసింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోమంటూ బ్యాంక్ ఖాతాదారులను కోరవద్దని ఎస్‌బీఐ అన్ని బ్యాంక్ బ్రాంచులకు ఆదేశాలు పంపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: