ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఇటీవలే విడుదల కాగా ఇక ఈ ఫలితాల్లో టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఏ పార్టీకి అందని విధంగా భారీ మెజారిటీ సాధించి దూసుకుపోయింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే గత ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు పోల్చి చూస్తే టిఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందనే చెప్పాలి. వరంగల్లో గత ఎన్నికల్లో 58.6 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 54.6 శాతం పోలింగ్ నమోదైంది.
టిఆర్ఎస్ అప్పుడు నలభై నాలుగు సీట్లు సాధిస్తే ఈ ఎన్నికల్లో మాత్రం 51 సీట్లు సాధించింది. కాంగ్రెస్ అప్పుడు 4 ఇప్పుడు 2.. బిజెపి అప్పుడు 1 సీట్ సాధిస్తే ఇప్పుడు 10 సీట్లు సాధించింది ఇక ఇతరులు అప్పుడు 9 స్థానాలు విజయం సాధిస్తే ఇప్పుడు మాత్రం మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.. 2016 - 2021లలో జరిగిన ఎన్నికల మధ్య టిఆర్ఎస్ బలం పుంజుకుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఖమ్మం కార్పొరేషన్ విషయానికి వస్తే.. అప్పుడు 66.67.. ఇప్పుడు 59.8 శాతం పోలింగ్ జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అప్పట్లో 34 ఇప్పుడు 37 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ అప్పుడు 10 సీట్లలో గెలిస్తే ఇప్పుడు తొమ్మిదితో సరిపెట్టుకుంది. అప్పుడు బిజెపి ఎలాంటి సీట్లు గెలవలేదు.. ఇప్పుడు మాత్రం ఒక సీట్లు గెలిచింది. ఇతరులు అప్పుడు ఆరు స్థానాల్లో గెలిస్తే ఇప్పుడు కూడా ఆరు స్థానాలు గెలిచారు ఇలా ఎన్నికల్లో అటు టిఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి