"కాలేజీ రోజుల్లోనే భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై ఆయనకు చాలా క్లారిటీ ఉండేది. మేము మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ఆయనకు 22 ఏళ్లు, నాకు 17 సంవత్సరాలు. మీ భవిష్యత్తు గురించి మా అమ్మతో ఏం చెప్పాలో చెప్పు అని నేను బిశ్వశర్మ ని ప్రశ్నించినప్పుడు.. నేను ఏదో ఒకరోజు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని ఆమెకు చెప్పు అని ఆయన బదులిచ్చారు" అని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు.
అయితే ముఖ్యమంత్రిని అవుతానని బిశ్వశర్మ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారట. కానీ ఆ తర్వాత తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఖచ్చితమైన లక్ష్యాలు, దృఢమైన సంకల్పం ఉన్నాయని ఆమె గర్వంగా ఫీల్ అయ్యారట. దృఢమైన సంకల్పం తో రాష్ట్రం కోసం బిశ్వశర్మ కలలు కంటున్నారని తనకు యుక్తవయసులోనే తెలిసినట్టు ఆమె చెప్పుకొచ్చారు.
''ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఆయన మంత్రి అయ్యారు. అప్పటి నుంచి పాలిటిక్స్ లోనే కొనసాగుతున్నారు. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. గత రాత్రి సంభాషణలో ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారు అని నాతో ఆయన అన్నారు. ఎవరిని అని నేను అడిగాను. నన్నే అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన నాకు ఎప్పటికీ హిమంత లాగానే కనిపిస్తారు. అతనిని నేను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేను. ఆయన రాష్ట్రానికే నాయకుడని గ్రహించడానికి నాకు కొంచెం టైం పడుతుంది,'' అని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు.
ఇకపోతే శర్మ భార్య మీడియా వ్యవస్థాపకురాలు.. కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. 19 ఏళ్ల నందిల్ బిస్వా శర్మ, 17 ఏళ్ల సుకన్య శర్మ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి