ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం భారత  దేశాన్ని అతలాకుతలం చేస్తుంది ఈ వైరస్. ఏ రోజు ఎటువంటి భయానకరమైన వార్త వినవలిసి వస్తుందో అర్ధం కావడం లేదు. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో విజృంభిస్తోన్న కరోనా  వైరస్ సెకండ్ వేవ్ కు 5జీ టెస్టింగ్ టెక్నాలజీనే కారణమంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ వచ్చిన వీడియో అవాస్తవం అని స్పష్టం చేశాయి.దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు 5జీ టెస్టింగ్ కు సంబంధం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఈ వార్తలు విని బెంబేలెత్తి పోతున్నారు.


 దీనితో ఏకంగా మన కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. తప్పుడు సమాచారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అసలు 5జీ టెక్నాలజీకి, కరోనావైరస్ వ్యాప్తికి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్రం తేల్చి పారేసింది.ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం అని తేల్చి చెప్పేసింది. ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని టెలికాం విభాగం(డాట్) స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో కరోనా వైరస్ కి సంబందించిన వార్తలను అసలు నమ్మవద్దని చెప్పింది.


5జీ నెట్‌వర్క్‌ టెస్టింగ్ చేయడం వల్ల కరోనా రాలేదని, 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదని డాట్ స్పష్టంచేసింది. మొబైల్‌ టవర్ల నుంచి నాన్‌-అయానైజింగ్‌ రేడియో తరంగాలు చాలా తక్కువ శక్తితో వెలువడతాయని పేర్కొంది.ఆ రేడియో తరంగాలకి కరొనా వైరస్ కి సంబంధం లేదని అవి మానవ శరీర కణాలపైగాని,మానవులపై గాని ఏ విధమైన ప్రభావాన్నీ చూపలేవని డాట్‌ పేర్కొంది. నాన్‌-అయానైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్‌(ICNIRP), WHO సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో ఉన్నామని డాట్‌ తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: