కొన్ని వర్గాల ప్రజలకు నేరుగా వ్యాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులందరికీ కూడా తప్పనిసరిగా కోవిషీల్డ్ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యం లో ఇలా విదేశీ విద్య కోసం వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా అటు ఎప్పుడు పబ్లిక్ కి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియాలోని రిపోర్టర్స్ సహా మిగతా అందరికీ కూడా వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా జనాలతో ఎక్కువగా కనెక్టింగ్ ఉన్న వాళ్లకి కూడా టీకా అందించేందుకు సిద్దమైంది. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బెస్ట్ అని అంటున్నారు విశ్లేషకులు.
అయితే అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులు ఎంతో మంది పత్రికా విలేకరులు సైతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు . మరి రానున్న రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి