ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉండటంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ.. అంతకు ముందు మాత్రం ప్రమాదకర రీతిలో వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో దేశంలో థర్డ్ వేవ్ మొదలు కాబోతోందని అటు ఎంతో మంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ మూడవ దశ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా చిన్నారులపై ఉంటుంది అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ మొదలు కాకముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ముందస్తు జాగ్రత్తలతో సిద్ధమవుతున్నాయి.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ఐసియు బెడ్స్ సిద్ధం చేస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనికి సంబంధించిన కార్యాచరణ జరగడం లేదు అన్నది తెలుస్తుంది. చిన్నారుల కోసం కేవలం రాష్ట్రం మొత్తంలో 20 బెడ్స్ మాత్రమే ఉన్నాయి అని ఇటీవల సీనియర్ లాయర్ రవిచందర్ హైకోర్టుకు తెలిపారు. ఇక 20 బెడ్స్ కూడా కేవలం నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ఉన్నాయని.. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో కూడా చిన్న పిల్లల కోసం ఆక్సిజన్, ఐసియు బెడ్స్ లేవు అని స్పష్టం చేశారు. ఇక లాయరు వాదనలు పై స్పందించిన కోర్టు తెలంగాణా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో చిన్న పిల్లల కోసం ఎనిమిది వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని.. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి