ఈట‌ల రాజేంద‌ర్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల స‌మ‌క్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంధ‌ర్భ‌వ‌గా ఆయ‌న మాట్లాడుతూ....హుజరాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున‌ కార్యకర్తలు బీజేపీ లో చేరడం జరిగిందన్నారు. బీజేపీ లాంటి జాతీయ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గత అనేక ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం లో పని చేశామని..ఉద్య‌మంలో ప్రజలకు త‌మ తెలుస‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పురోఅభివృద్ధిలో మేధావుల సలహాలు ,సూచనలు ఉంటాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రకటించారు... కానీ ఏ రోజు కూడా సూచనలు కూడా తీసుకోలేదని అన్నారు. అంతే కాకుండా అస‌లు అపాయింట్ మెంట్ కూడా దొర‌కలేద‌ని అన్నారు. 

తెలంగాణ ఉద్యమంమంలో ఎన్ని అవమానాలు జరిగినా  భరించామని...ఏ రోజుకూడా బయట పడలేదని చెప్పారు. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌వాత తెలంగాణ వ‌చ్చిన త‌ర‌వాత కూడా అవ‌మానాలు ఎదురుకున్నామ‌ని అన్నారు. ఎన్నికల్లో 88 సీట్లు గెల్చుకున్నామని....ఆయన ఇతర పార్టీల ఎమ్మెల్యేను జాయిన్ చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజస్వామ్యం ఉంటుందా...? ఇంటర్నల్ స్వేచ్ఛ ఉంటుందా....?అని మీడియా మిత్రులు ప్ర‌శ్నించ‌గా.... అలా ఉండదు అని సీఎం అన్నారని ప్ర‌జాస్వామ్యం ఉంటే రాష్ట్రాన్ని కోఠీలో అమ్మ‌కువ‌స్తార‌ని అన్న‌ట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయినా కూడా కేబినెట్ వేయలేదని .. ముఖ్య‌మంత్రికి ఎంత అహకరం అని అన్నారు. 

కాంగ్రెస్ లో గెలిచిన శాసన సభ్యులను కూడా పార్టీలో చెర్చుకున్నారని అన్నారు. ఇంట్లోడు బయటోడు అయ్యిండు...బయటోడు ఇంట్లోడు అయ్యాడు....అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనేక ఘర్షణల తర్వాతే పార్టీ నుండి తాము భ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ నాయకులను కలుపుకొని  పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి త‌న‌పై చేసిన‌ ఆరోపణలు ప్రూఫ్ చేయకపోతే ముక్కు నేలకు రాస్తారా..? అంటూ స‌వాల్ చేశారు. త‌న‌ మొత్తం ఆస్తుల పై సీబీఐ, సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాల‌ని కోరారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆస్తుల పై ,త‌న‌ ఆస్తుల  విచారణ జరపాలని అన్నారు. అంతే కాకుండా హుజురాబాద్ లో 100 శాతం గెలుస్తామని వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: