గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో అటు టిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  జిహెచ్ఎంసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలను సైతం కురిపించింది.  ఇక టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలు పొందుపరిచింది.  ఇందులో ఉచితంగా నీరు అందించడం ఒకటి.  జిహెచ్ఎంసి పరిధిలో అందరికీ 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు అందిస్తామని ప్రకటించింది.  ఇక టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 20 వేల లీటర్ల కంటే ఎక్కువ నీరు వినియోగించినప్పుడు మాత్రమే ఇక బిల్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇటీవలే వాటర్ బిల్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎన్నికల తర్వాత కేవలం నాలుగు నెలలు మాత్రమే కొంతమందికి వాటర్ బిల్ వేశారట. ఇప్పుడు వాటర్ బిల్ సవరణ పేరుతో ఒకే సారి 5 వేల 400 రూపాయలు బిల్లు అందరికీ చేతిలో పెడుతున్నారూ అంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. ఇక ఇంత భారీగా బిల్లులు రావడంతో ప్రజలందరూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.



 అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా 20 వేల లీటర్లు ఉపయోగించుకునే వారికి ఇక ఉచితంగానే నీరు అందిస్తున్నారట. ఇక 20 వేల లీటర్ల కంటే ఎక్కువ నీరు వినియోగించుకుంటే.. వారికి 20 వేల లీటర్ల తో కలిపి టోటల్ ఇస్తున్నారట.  అయితే కరోనా కష్టకాలంలో ఉపాధి దొరకక అల్లాడిపోతూ ఉంటే   ఇక ఇప్పుడు భారీగా వాటర్ బిల్లులు కంటతడి పెట్టిస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట జిహెచ్ఎంసి ప్రజలు.  అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని.. దీనికి సంబంధించిన ప్రచారం మాత్రం ప్రస్తుతం ఊపందుకుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి..అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: