కృష్ణా జిల్లా రాజకీయాల్లో బాగా ఫాలోయింగ్ నాయకుల్లో వల్లభనేని వంశీ కూడా ఒకరు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి సొంతంగా ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో గెలవగలిగారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ, 2019లో అదే టీడీపీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉన్నా సరే గన్నవరం బరిలో వంశీ గెలవగలిగారు.
ఇక ఎమ్మెల్యేగా గెలిచాక కొన్నిరోజులు రాజకీయాల నుంచి తప్పుకుంటానని హడావిడి చేసిన వంశీ, తర్వాత వైసీపీ వైపుకు వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, వైసీపీ కండువా కప్పుకోకుండా, జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అంటే పరోక్షంగా వంశీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ వైసీపీ వైపు వెళ్ళడంతో గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా సీనియర్ నాయకుడు బచ్చుల అర్జునుడుని పెట్టారు.
అయితే అర్జునుడు పేరుకే ఇన్‌చార్జ్‌గా ఉన్నారుగానీ, వంశీకి పోటీ ఇవ్వడంలో వెనుకబడే ఉన్నారు. ఎందుకంటే వంశీకి గన్నవరంలో పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. అందుకే అర్జునుడు, వంశీకి పోటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. మొన్న పంచాయితీ ఎన్నికల్లో సైతం గన్నవరంలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. అర్జునుడు ఏ మాత్రం టీడీపీని నిలబెట్టలేకపోయారు. మొదట నుంచి గన్నవరం టీడీపీకి కంచుకోటగానే ఉండేది. కానీ వంశీ వచ్చాక పరిస్తితి మారింది. ఆయన సొంతంగా మంచి ఇమేజ్ పెంచుకున్నారు. దాని వల్ల వంశీ వైసీపీ వైపుకు వెళ్లడంతో, టీడీపీ కేడర్ చాలావరకు వంశీతో వెళ్లిపోయింది.
దీని వల్ల గన్నవరంలో టీడీపీ వీక్ అయింది. అర్జునుడు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఎక్కాడా కూడా వంశీకి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో వంశీకి చెక్ పెట్టడం అర్జునుడు వల్ల కాదు. మరి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వ్యూహం మార్చి గన్నవరంలో వంశీ మీద బలమైన నేతని బరిలోకి దింపుతారేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి