కొత్త జోన్లకు ఆమోదం రావడంతో ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతోందని చెబుతున్నారు. ఏకంగా ఒకేసారి 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారట. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని సీఎం కేసీఆర్ ఆదివారం నోటిఫికేషన్ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నారు.
సిరిసిల్ల పర్యటనలోనే కేసీఆర్ ఈ 19 వేల ఉద్యోగాల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ అవుతుంది. తెలంగాణ వచ్చాక 2014లో తొలిసారి పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తరవాత 2018లో మరోసారి భారీగా పోస్టులు ప్రకటించారు. 2018లో 1,217 మంది ఎస్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
అయితే 2018 నోటిఫికేషన్‌లో దాదాపు 3 వేల వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ సిద్దం చేశారు. ఈ పోస్టుల్లో 33శాతం మహిళలకు కేటాయించనున్నారు. కొత్త నోటిఫికేషన్‌లో ఎస్సై -360(సివిల్), 29(ఏఆర్), 20(కమ్యూనికేషన్స్) ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుళ్లు- 7,700(సివిల్), 6,680(ఏఆర్), టీఎస్‌ఎస్‌పీ(3,850), 15వ బెటాలియన్(560), కమ్యూనికేషన్(250).. ఇలా మొత్తం 19,449 పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి