అయితే మరికొన్ని రోజుల్లో ఇక బ్రిటన్లో ఉన్న ఆంక్షలు ఎత్తివేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు క్రమక్రమంగా కఠిన ఆంక్షలు మధ్య నుంచి కోలుకుంటుంది. ఇక అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. ఇక అందరికీ వ్యాక్సిన్ అందించడంలో బ్రిటన్ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జూలై 19 వ తేదీ నుంచి ఇక లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజుల వరకు కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షలు అన్నింటిని జూలై 19 వ తేదీ నుంచి ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు ప్రధాని బోరిస్ జాన్సన్ అయితే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన తర్వాత కరోనా ముగిసిపోయిందని భావించకూడదు అంటూ చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పుకొచ్చారు. అయితే వ్యాక్సిన్లు వైరస్పై సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. అయితే ఇక ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఇంకా ఎప్పుడూ మనం సాధారణ పరిస్థితికి వస్తాం అని ప్రతి ఒక్కరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటూ బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి