ఇక బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సిటీ లో బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అయితే తెలంగాణలోని ఎంతో ఫేమస్ అయిన మహంకాళి బోనాల ఉత్సవాలు ఈనెల 25వ తేదీన జరగబోతున్నాయి ఈ క్రమంలోనే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.
మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు బోనాలు ఉత్సవాలు జరుపుకునేల చూడాలని సూచించారు. ఇక మాస్కులు శానిటైజర్ లు వాడకం తప్పనిసరిగా ఉండాలి అని.. అందరూ బౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులకు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం పై అటు ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి