ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రెండో బొండాయిగా పేరున్న ఓ ప‌ట్ట‌ణంలో ఇప్పుడు అధికార పార్టీలో రాజ‌కీయం ముదురు తోంద‌ని తెలుస్తోంది. క‌ర్నూలు జిల్లాలో ఆదోనిని మినీ బొంబాయిగా పిలుస్తూ ఉంటారు. క‌డ‌ప జిల్లాలో ప్రొద్దుటూరును మినీ బొంబాయిగా.. బంగారు ప‌ట్ట‌ణంగా పిలుస్తూ ఉంటారు. ఇక్క‌డ నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ రాచ‌మ‌ల్లు శివ ప్ర‌సాద్ రెడ్డి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు. అయితే రెండో సారి గెలిచాక ఎమ్మెల్యే దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో ఆయ‌న‌పై కాస్తంత వ్య‌తిరేక‌త అయితే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లోనూ, సాధార‌ణ జ‌నాల్లోనూ ఉంద‌ని అంటున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నే కింగ్‌.. మ‌రో నాయ‌కుడు లేకుండా పోయాడు. ఆయ‌న చెప్పిందే వేదం అయ్యింది. అయితే ఇప్పుడు అధికార పార్టీలోనే అక్క‌డ నుంచి మరో నేత త‌యార‌య్యాడు. దీంతో రాచ‌మ‌ల్లు దూకుడుకు బ్రేకులు ప‌డుతున్నాయి. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ కోటాల ఆ ప‌ట్ట‌ణానికి చెందిన ర‌మేష్ యాద‌వ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తున్న‌ట్టు రాచ‌మ‌ల్లుకు తెలియ‌ద‌ట‌. రాచ‌మ‌ల్లుకు తెలియకుండానే ర‌మేష్ యాద‌వ్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రావ‌డంతో రాచ‌మ‌ల్లు జీర్ణించుకోలేకున్నార‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లోనే వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రో వైపు ర‌మేష్ యాద‌వ్ కు జ‌గ‌న్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌డంతో ఆయ‌న జిల్లా అంత‌టా దూసుకు పోతున్నారు. క‌డ‌ప ఎంపీ అవినాష్ తో నిత్యం ట‌చ్‌లో ఉంటూ ప్రొద్దుటూరు లో దూసుకు పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ఎంపీ తో చ‌క్రం తిప్పించిన ఎమ్మెల్సీ త‌న అన‌చ‌రుల ప‌ట్ల దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన ఓ పోలీస్ అధికారిని బ‌దిలీ చేయించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఇష్ట‌ప‌డి వేయించుకున్న అధికారిని ఎమ్మెల్సీ బ‌దిలీ చేయించ‌డంతో ఎమ్మెల్యే త‌ట్టుకోలేక పోతున్నార‌ట‌. ఇక ఇటీవ‌ల ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్ రావ‌డం వెన‌క కూడా ర‌క‌ర‌కాల అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా ప్రొద్దుటూరు వైసీపీ రాజ‌కీయం అయితే ర‌స‌కందాయంలో ప‌డింది.


మరింత సమాచారం తెలుసుకోండి: