ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు కూడా వస్తున్నాయి అయితే వరదల కారణంగా ఎన్నో ప్రాంతాలు నీట మునిగి పోతున్నాయి. తద్వారా ఎంతో మంది ఇక కరోనా వైరస్ ప్రాణభయంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చివరికి ప్రకృతి విపత్తు కారణంగా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా మనుషుల ప్రాణాలు తీయడానికి వైరస్ మాత్రమే కాదు ప్రకృతి విపత్తులు సైతం దూసుకొస్తున్నాయి. ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నలభై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
కరోనా వైరస్ వల్లనో.. లేక వరదల వల్లనో కాదు ఏకంగా పిడుగుపాటు వల్ల 48 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఉత్తర భారతంలో 68 మంది పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆదివారం రోజున ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురిసాయి. పిడుగులతో కూడిన వర్షాలతో ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే రాజస్థాన్లో 20 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్ర లో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 41 మంది పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి