ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా అయితే.. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాలి. ఫైజర్ వ్యాక్సిన్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఆ మేరకు చల్లదనాన్ని అందించే ప్రత్యేక శీతల స్టోరేజీ యంత్రాలు తప్పనిసరి. అయితే ఈ సౌకర్యాలు మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అయితే ఇప్పుడు ఈ సమస్య తీరబోతోంది. ఎందుకంటే.. ఇక పై శీతల యంత్రాల్లో భద్రపరచాల్సిన అవసరం లేని ఉష్ణ టీకాలు రాబోతున్నాయి.
ఈ ఉష్ణ టీకాలను తీసుకొచ్చేందుకు భారత్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో సక్సస్ అయ్యారు కూడా. భారత్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మైన్‌వ్యాక్స్ అనే బయోటెక్ సంస్థ ఈ టీకాలను డెవలప్ చేస్తున్నాయి. అంతే కాదు.. ఈ టీకాల సామర్థ్యంపై ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎస్‌ఐఆర్‌వో సంస్థ మదింపు జరిపింది. ఈ టీకాలను కరోనాలోని అన్ని రకాలపై వీటిని పరీక్షించింది.
ఈ ఉష్ణ టీకాలు ఎలుకల్లో బలమైన రోగనిరోధక స్పందనలను కలిగించాయట. ఈ టీకాలు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా నెల రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉన్నాయట. అంతే కాదు.. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద 90 నిమిషాల కూడా అవి పాడైపోలేదట. అంతే కాదు.. ఈ ఉష్ణ టీకాలు కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను సమర్థంగా అడ్డుకుంటున్నాయట. ఇవి త్వరగా అందుబాటులోకి వచ్చేస్తే ఇక పల్లెలకూ టీకాలు బాగా చేరువవుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి