ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరునికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దేశం మొత్తం ఒకే గుర్తింపు కార్డు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ప్రయత్నం ఎంతో సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ..  ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉంటున్నార. అంతేకాకుండా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అయినా సరే ఇక ఆధార్ కార్డు అనేది ఒక తప్పనిసరి డాక్యుమెంట్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ఆధార్ కార్డు లో ఏవైనా తప్పులు ఉన్నప్పుడు ఇక వివిధ రకాలుగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది . అందుకే ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరి చేసుకునేందుకు ఇటీవలి కాలంలో అందరు సిద్ధం అవుతున్నార. ఇక ఆధార్ కేంద్రాల కి వెళ్తున్నారు. అయితే ఇలా ఆధార్ కేంద్రాల వద్ద భారీగా క్యూ ఉంటుండడంతో ఇక గంటల తరబడి నిరీక్షించాల్సి న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  అయితే ఇలా గంటల తరబడి నిరీక్షించిన అటు పని జరుగుతుంది అన్న నమ్మకం మాత్రం ఉండటం లేదు. దీంతో ఆధార్ కార్డుల్లో తప్పులను సరి చేసుకోవడానికి కొన్ని రకాల మార్పులు చేసుకోవడానికి ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 అయితే చాలా మందికి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటుంది అయితే ఇలా ఆధార్ కార్డులో పుట్టిన తేది తప్పుగా ఉంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడవలసిన అవసరం లేదు. సులభంగానే సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా ssup.Uidai.gov.in/ssup/ వెబ్సైట్లోకి వెళ్లి సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.  ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ టు ఆధార్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపి ఎంటర్ చేసి ఇక పుట్టినరోజు తేదీల్లో మార్పులు చేయాలి. ఇక అడిగిన డాక్యుమెంట్లను సమర్పించాలి ఆ తర్వాత యుఐడిఎఐ మీరు సమర్పించిన డాక్యుమెంట్ ను పరిశీలించిన తర్వాత మీ పుట్టిన తేదీని మార్పు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: