తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి... డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అన్న వారి నోటే... శభాష్ అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో ఒడిదొడుకులు వచ్చినప్పటికీ... తనదైన అనుభవాన్ని వెలికి తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస ప్రెస్ మీట్స్ పెట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి.

అలాగే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికే నాయకులు కూడా వేస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే  అధికార టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ లో ఉన్న నాయకులను కూడా కాంగ్రెస్ లోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుణ్ణి కాంగ్రెస్ పార్టీలోకి లాగేసారు రేవంత్ రెడ్డి. ఇలా చాలామంది నాయకులు రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ఇంకా తాజాగా మరో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు ... మాజీ టీడీపీ లీడర్ ప్రస్తుత టీఆర్ఎస్ కీలక నేత తీగల కృష్ణారెడ్డి. తీగల కృష్ణా రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారని పార్టీ నేతలు అందరూ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీగల కృష్ణా రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే తీగల కృష్ణా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల మృతి చెందాడని ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆయన పరామర్శించడానికి వెళ్లాడని... కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారని... రాజకీయ విశ్లేషకులు చర్చించు కుంటున్నారు. అయితే దీని పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: