అసలు ఈ కాలంలో ఆదర్శ భార్యలు కనిపిస్తారా అంటే.. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం ఇంకా అక్కడక్కడ ఆదర్శ భార్యలు మిగిలే ఉన్నారు.. సభ్య సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఒక మహిళ బ్రతికుండగానే కాదు భర్త చనిపోయిన తర్వాత కూడా ఇక భర్త నే ప్రత్యక్ష దైవంగా భావిస్తోంది. సాధారణంగా ఇక భర్త చనిపోయిన తరువాత అతని ఫోటో ఒక మూలన పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న భార్య మాత్రం ఏకంగా భర్త జ్ఞాపకాల తోనే బ్రతుకుతూ భర్త కోసం ఒక గుడి కట్టింది.
ఈ ఇల్లాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం కు చెందిన అంకిరెడ్డి పద్మావతి భార్య భర్తలు ఇక వీరు పెళ్లి అయిన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. ఇక అంకిరెడ్డి నాలుగేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే భర్త చనిపోయినప్పటికీ ఆమె భర్త జ్ఞాపకాలు లోనే బతుకుతుంది. భర్త కోసం ఏకంగా పాలరాతి విగ్రహం ప్రతిష్టించి గుడి కట్టింది. ప్రతిరోజు ఆ గుడిలో విగ్రహానికి పూజలు చేస్తూ ఆదర్శ ఇల్లాలు గా మారిపోయింది ఈ మహిళ. అంతే కాదు అప్పుడప్పుడు పేదలకు అన్నదానం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి