తెలంగాణాలో ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగా రాజకీయాలు జోరుమీదున్నాయి. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తగిన వ్యూహాలను అమలు చేసే పనిలో తలమునకలై ఉన్నారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకువడానికి తెరాస సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసమే హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో వైపు ఈటల రాజేందర్ ఆకలిగొన్న పులిలా ఉన్నాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఎలాగూ ఈ ఎన్నికలో పెద్దగా ప్రభావం చూపలేని కాంగ్రెస్ పార్టీ సైతం రేవంత్ రెడ్డి సారథ్యంలో సరైన పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే తెలంగాణలో నాన్న పేరును నిలబెట్టాలి..నాన్న పెట్టిన పధకాలను మళ్ళీ బ్రతికేలా చేయాలి అంటూ షర్మిలక్క పార్టీ పెట్టింది. పార్టీ అయితే పెట్టింది కానీ తర్వాత ఎలా ? అనే విషయం మరిచిపోయినట్టుంది.

దివంగత రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానం, ప్రేమ కాపాడుతుందేమో అని భ్రమపడినట్టుంది. కానీ ఇవేమీ వర్క్ అవుట్ కావని తెలుసుకో అక్కా...! పార్టీ పెట్టిన రోజే సీఎం అవ్వాలని అనుకుందో ఏమో కానీ...వచ్చి రాగానే అధికార తెరాస పై విమర్శల వర్షం కురిపించింది. ఇప్పుడు మరో ప్రణాళికను రెడీ చేసుకుంటోంది. త్వరలో హుజురాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంతకు  ముందు మనము చెప్పుకున్నట్లుగా షర్మిలక్క పోటీ చేయకపోయినా రేవంతన్నకు సపోర్ట్ చేస్తుందనుకున్నాము. కానీ ఇప్పుడు ఏకంగా వైఎస్సార్టీపీ ఈ ఎన్నికలో పోటీకి దిగుతోందని తెలుస్తోంది. అది కూడా మాములుగా కాదు ఏకంగా 100 నుండి 200 మంది అభ్యర్థుల వరకు నామినేషన్ లు వేసేందుకు చూస్తున్నట్లు సమాచారం. షర్మిలక్క ఏమి చేస్తున్నారో అర్ధం కావట్లేదు.

అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మరియు రేవంతన్నకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపైనా ఎక్కువగా దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. అసలు... పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా ఏమైనా చేస్తే బాగుండని వైఎస్సార్ అభిమానులు మరియు మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. కానీ షర్మిలక్క ఏమో ఇలా చేస్తోంది. అయితే షర్మిలక్క వ్యూహాల వలన అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ కే అనుకూలమయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఈ ఎన్నికలో పోటీ చేయాలనుకున్నా ఉండేది చాలా తక్కువ సమయం. ఈ సమయంలో రిస్క్ చేసి ఓటమి పాలు కావడం కన్నా... ఈటలన్నకో రేవంతన్నకో మద్దతిస్తే సరిపోవు కదా అని మరికొందరంటున్నారు. మరి చివరాఖరికి అక్క మనసులో ఏమి దాగుందో రాజన్నకే ఎరుక.

మరింత సమాచారం తెలుసుకోండి: