ఐసిస్-కె ఉగ్ర సంస్థ మిడిల్ ఈస్ట్ జీహాద్ ఎజెండాతో ఏర్పాటైంది. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టులో బ్లాస్టులతో వార్తల్లో నిలిచింది. ఇక.. ఐసిస్-కె నెక్స్ట్  భారత్ పై దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దేశంలో దాడులు చేయడం, యువతను సంస్థలోకి ఆకర్షించడం, భారత్ లో ఇస్లాం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో పనిచేస్తున్నారట. భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్ ను యాక్టివ్ చేసేపనిలో ఉన్నారు ఈ ముష్కరులు.

ఆప్ఘానిస్థాన్ లో కాబూల్ విమానాశ్రయంలో ఐసిస్-కె ఉగ్రదాడికి పాల్పడింది. అందులో 200మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో కరుడుగట్టిన భావజాలం ఉన్నవాళ్లు 2014లో ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వాళ్లే ఐసిస్-కె గా పిలుస్తున్నాం. ఖొరాసన్ వీళ్ల ప్రధాన స్థావరం. అందుకే ఆ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించేందుకు ఐసిస్ పేరుకు కె అనే అక్షరాన్ని జోడించారు.

ఇక కాబూల్ ఎయిర్ పోర్టులో ఐఎఐఎస్-కె జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లకు అమెరికా చెప్పినట్టే.. ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఆప్ఘానిస్థాన్ నిలోని ఐసిస్ ముఖ్యనాయకుడిపై వైమానిక దాడి చేసి అంతమొందించింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన తర్వాత రోజే.. దాడి చేసింది. కాబూల్ విమానాశ్రయం దగ్గర గురువారం జరిగిన పేలుళ్ల ఘటనలో 13మంది అమెరికా సైనికులు మృతి చెందారు.

భారత్ తో సహా అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్టు తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆప్ఘాన్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత్ తన విధానాన్ని రూపొందించుకోవాలని ఆశిస్తున్నామన్నారు. ఆప్ఘాన్ వేదికగా ఏ ఇతర దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించమని చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న సమస్యలను రెండు దేశాలు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఆఫ్ఘానిస్థాన్ లో మీడియాను షట్ డౌన్ చేసేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ మసూద్ హోసైనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళా జర్నిలిస్టులను బెదిరిస్తున్నారని.. బయటికి మాత్రం మీడియా సిబ్బంది స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: