అయితే ఇది కొత్తగా కనిపెట్టినదేమీ కాదు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే C.1.2 రకం కరోనా వేరియంట్‌ను గుర్తించారట. దక్షిణాఫ్రికా ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఆగస్టు నాటికి ఈ వేరియంట్‌ను చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ కనిపించిందట. ఇంత తక్కువ సమయంలో ఇన్ని దేశాల్లో కనిపించడంతో అంతటా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కొత్త రకం C.1.2 వేరియంట్ దక్షిణాఫ్రికాలో స్థిరంగా పెరుగుతూ ఉందట. గణాంకాల్లో చెప్పాలంటే. మే నెలలో ఈ కొత్త రకం వేరియంట్ వ్యాప్తి 0.2 శాతంగా ఉంది. అదే జూన్ నాటికి1.6 శాతానికి.. జూలైలో 2 శాతానికి పెరిగిందట. ఈ వేరియంట్ కూడా డెల్టా వేరియంట్ రేంజ్‌లోనే ఓ చూపు చూస్తోందట. బాగా వేగంగా వ్యాపిస్తోందట. C.1.2 వేరియంట్ ఏడాదికి 41.8 శాతం మ్యుటేషన్ రేటును కలిగి ఉందని దక్షిణాఫ్రికా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ రేటు మామూలుది కాదు.. ఇది ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన వేరియంట్ల మ్యుటేషన్ రేటు కంటే రెట్టింపట.
ఈ C.1.2 రకం కరోనా వైరస్ కరోనా వ్యాక్సిన్‌లకు కూడా లొంగకుండా వ్యాప్తి చెందుతోందట. టీకాల నుంచి లభించిన రోగ నిరోధక శక్తిని తట్టుకొని ఈ మహమ్మారి వృద్ధి చెందుతోందట. సో.. ఇలాంటి వేరియంట్లు విజృంభిస్తే.. మళ్లీ కరోనా పాత రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి