ఆఫ్ఘానిస్తాన్‌ కంట్రీ లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం మనకు తెల్సిందే.  అత్యంత దారుణంగా తాలిబన్లు...  అఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని వశం చేసుకున్నారు. దీంతో ఆ దేశం లోని ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు.  నరక యాతన అనుభవిస్తున్నారు ప్రజలు.  ఇక ఈ తాలిబన్ల దౌర్జన్యాలను భరించలేక, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని వదిలి పారిపోతున్నారు జనాలు.  మామూలు ప్రజలే కాదు.. వీరిలో మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ మరియు మంత్రులు సహా చాలా ప్రముఖులు ఉండటం గమనార్హం.  

ఆ దేశ మాజీ డిప్యూ టీ అంత ర్గత శాఖ మంత్రి జనరల్‌ ఖోషల్‌ సదత్‌ కూడా టీం బ్యాచ్‌ కు చెందిన వారే.  అయితే... దేశం నుంచి పారి పోయిన  మాజీ డిప్యూటీ అంతర్గత శాఖ మంత్రి జనరల్‌ ఖోషల్‌ సదత్‌ తాజా గా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆయన ఓ మీడియా తో మాట్లాడుతూ....  ఆఫ్ఘనిస్థాన్‌ దేశం వచ్చి తాలిబన్లకు తాను మద్దతు ఇచ్చేం దుకు పూర్తి గా సిద్ధంగా ఉన్నానని వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. కానీ దీనికి ఓ కండీషన్‌ కూడా పెట్టారయన. అఫ్ఘనిస్థాన్‌ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న తాలిబన్లు...  ఆ దేశంలోని మహిళలను గౌరవించి... వారి హక్కులకు భంగం కలించ కుడదని తెలిపారు.
 
అంతేకాదు.. ఆ దేశ చిహ్నాలను, ప్రజలకు సౌకర్య వంతమైన పాలన అందించాలని కోరారు.   ఈ కండీషన్లకు తాలిబన్లు అంగీ కారం తెలిపితే.. తాను కచ్చితంగా మళ్లీ అఫ్ఘనిస్తాన్ వస్తా నని....  తాలిబన్ల పాలన లో తాను కూడా పని చేస్తా నని స్పష్టం చేశారు. తాలిబన్ల కొత్త ప్రభు త్వానికి మద్దతు తెలపడమే కాకుండా... అక్కడి ఎయిర్స్‌ పోర్స్‌ మరియు స్పెషల్‌ ఫోర్స్‌ ను మళ్లీ గాడిలో పెడతానని తెలిపారు  ఖోషల్‌ సదత్‌. తనకు అఫ్ఘనిస్థాన్ ప్రజల మేలు మాత్రమే ముఖ్యమన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: