సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితులు రాజు గురించి గత కొన్ని రోజులుగా జల్లెడ పడుతున్నారు పోలీసులు.  ఏకంగా నిందితుడు రాజును పట్టించిన వారికి పది లక్షల రివార్డును కూడా ప్రకటించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇక నిందితుడు రాజుని పట్టుకుని వెంటనే ఉరిశిక్ష వేయాలి అంటూ అటు తెలంగాణ ప్రజానీకం మొత్తం డిమాండ్ చేసింది. మరోసారి ఆడపిల్లలపై అత్యాచారం చేయాలంటేనే భయపడేలాగా రాజుకు విధించే శిక్ష ఉండాలి అంటూ ఎంతో మంది డిమాండ్ చేశారు.



 ఇక పోలీసులు నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలోనే అటు రాజు ఏకంగా ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్  పై విగతజీవిగా కనిపించడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. స్టేషన్ ఘన్పూర్ మండలం పామూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు శవం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి చేతి మీద ఉన్న మౌనిక అనే టాటూ గమనించి రాజుగా గుర్తించారు. ఇక రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్ని అక్కడ ప్రత్యక్షసాక్షులు కూడా చెబుతూ ఉండటం గమనార్హం.



 రాజు మృతి చెందడంతో ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవలే ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం హత్య నిందితుడు రాజు మృతి ప్రజల విజయం అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు న్యాయ పోరాటం చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని తెలిపారు. ఇక నిందితుడు రాజు తప్పులతో సంబంధంలేని అతని భార్య కూతురు బాధ్యత అటు ప్రభుత్వానిదే అంటూ సీతక్క వ్యాఖ్యానించారు. ఓవైపు నిందితుడికి శిక్ష పడాలి అంటూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం డిమాండ్ చేస్తే అటు ప్రభుత్వం మాత్రం కేసును తప్పుదోవ పట్టించింది అంటూ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: