ముఖ్యంగా లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆర్కే రోజాకు ఈ సరైన మంత్రి పదవి దక్కుతుందా అని రోజా అభిమానులు మరియు నగరి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే మొన్ననే ఏఐసీసీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనితో మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అనే భావన అందరిలో నెలకొంది. అయితే రోజాకు మంత్రి పదవి ఇస్తే, ఏ శాఖను కేటాయిస్తారనే దానిపైన కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన మాటల తూటాలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టగల వాక్చాతుర్యం రోజా సొంతం. రెండు రోజుల క్రితమే టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్ర్హుడిపై ఏ రేంజ్ లో ఫైర్ అయిందో చూశాము.
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో హోమ్ మంత్రిగా ఉన్న మేకతోటి సుచరిత స్థానంలో రోజాకు ఆ శాఖను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఎంతో నమ్మకంతో సుచరితకు హోమ్ మంత్రి ఇచ్చినా ఆ స్థాయిలో ప్రభావాన్ని చూపించలేదని తెలుస్తోంది. అందుకే శాఖను మార్చడానికి చూస్తున్నారట. మరి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఊహాగానాలే మరి నిజమవుతాయా తెలియాలంటే... ఇంకో మూడు నెలల వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి