ఆంధ్రప్రదేశ్ సీఎం ఆసక్తికరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంత వరకు ఏపీ ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను రూపుమాపుకోవడానికి సకల ప్రత్త్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యే లు మరియు ఎంపీలు చేసే స్వార్దపరమైన పొరపాట్లు కారణంగా జగన్ చిక్కుల్లో పడే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే లీడర్ ఆఫ్ ది స్టేట్ గా ప్రజలకు ఏ అన్యాయం జరిగినా అన్నింటికీ జగన్ కారణం అవుతున్నాడు. అందుకోసం ఈ సారి ప్రజల చేత ఎన్నిక కాబడిన ఎమ్మెల్యే లను సైతం నమ్మకుండా అడుగులు వేయడానికి సిద్ధ పడుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవల జగన్ చేసిన ఒక ప్రకటనతో ఇప్పుడు ఎమ్మెల్యే లు అందరిలోనూ వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ పాలనా తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ పలకరించనున్నారు. ఈ రచ్చబండకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా చెప్పకుండా  వెళ్లనున్నారు. ఈ ప్రకటనతో కొందరు ఎమ్మెల్యే లు అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పడుతుందో అన్న ఆందోళనతో జగన్ ఇప్పటి నుండి ప్రజల ఆదరణ లేని నియోజకవర్గాలను కనుగొని అక్కడ బలోపేతం చేసుకునే దిశగా ఈ రచ్చబండను ఉపయోగించుకోనున్నారు.

మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి జగన్ పునరాలోచించుకోవలసి ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. జగన్ చేసే ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుంది, ఎన్నికల్లో ఈ ప్రయోగం ఫలిస్తుందా అనేది చూడాలి. ఈ పర్యటన మాత్రం రాబోయే ఎన్నికలలో చాలా కీలకం కానుంది. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది ఇక్కడ కీలకం అవుతుంది.  ఓటర్లు జగన్ కు ఈ సారి షాక్ ఇవ్వనున్నారా లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: