నేను ప్రధానిని అయితే దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయగలను.. ఇలా ఎప్పుడైనా ఆలోచించారా! ఆ మనం ఏంటి, ప్రధాని ఏంటి అనుకోకండి. ఊరికే ఒక ఊహ చేయండి. అదేమీ తప్పుకాదు కదా. ఈ విధంగా ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు పడే కష్టం ఏంటో మనకు అర్ధం అవుతుంది. మన దేశం గురించి కూడా మనకు కాస్త తెలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దానివలన మనకు ఒరిగేది ఏమి ఉంది అనుకోకండి, ప్రతిదానిలో నోటు ప్రయోజనం చూసుకోకూడదు. ఒక్క సారి ఆలోచించి చూద్దామా..!

నేను ప్రధానిని అవ్వాలంటే నాకు పార్టీ ఉండాలి, దానిలో వాళ్ళు గెలిచి ఉండాలి, మాకే మెజారిటీ వచ్చి ఉండాలి, అప్పుడు మా వాళ్ళందరూ నన్ను ప్రధానిగా ఎన్నుకోవాలి. ఇదంతా జరిగిందే అనుకోండి. నేను ప్రధాని అభ్యర్థిని అని ప్రచారం అప్పుడైనా తెలియక ఉండదు కదా..! అప్పుడు నేను ఇలా ఆలోచించాల్సి ఉంది. నేను ప్రధానికి అయితే ముందుగా ఏమి చేయాలి. నా దేశానికి ఉన్న వనరులు ఏమిటి. బలం, బలహీనతలు ఏమిటీ, ఏయే రాష్ట్రాలలో ఏయే సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. నా దేశంలో పౌరుల కు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆ వ్యవస్థ మీద ఉందా, వాళ్లకు దేశం గురించి కనీస సమాచారం తెలుసా, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే నేను ఏమి చేయాలి. దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది, దానిని దాటేదెలా..! లాంటి ప్రశ్నలకు ముందు నేను సమాధానం తెలుసుకొని ఉండాలి.

మొదలు పెడితే, కనీస అవసరాలు గతంలో మూడే(ఆహారం, ఇళ్లు, వస్త్రం) ఉండేవి, అభివృద్ధి చెందీ చెందీ అవి ఆరు అయ్యాయి, అంటే ఇంకో మూడు(వైద్యం, విద్య, ఉద్యోగం) కలిశాయి. ముందు ఈ ఆరు అందరికి ఉండేట్టు చేయాలి. వెనక నుండి వెళ్తే అంటే ఉద్యోగం అందరికి ఇవ్వాలి. అది సాధ్యమేనా, దేశ జనాభా 134 కోట్లు, అందులో పని చేయగలిగిన వారు ఒక 75 శాతం అనుకుందాం. అంటే అంటే దాదాపుగా వంద(100.5) కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇందులో పని చేసే వయసు వచ్చిన పిల్లలు, యువకులు, మధ్యవయస్కులు, రిటైర్ అయ్యే వయసు వాళ్ళు, వంద కు దగ్గరగా ఉన్నా పని చేసే సామర్థ్యం ఉన్నవారు ఉంటారు. వాళ్ళవాళ్ళ పరిస్థితులను బట్టి పై ఆరు అవసరాలు అందరికి అందించే విధంగా ఆయా వస్తువుల ఉత్పత్తి, అమ్మకం వీళ్ళ చేత వీళ్లకు అందించాలి. అంటే ఆహారం అందరికి కావాలి, పండించే(దేశం లో అవసరాలు ఎంత-ఈ ఏడాదికి; వచ్చే ఏడాదికి నిల్వలు; విత్తన నిల్వలు; ప్రాసెస్ చేసి నిల్వలు; దానాలకు నిల్వలు; అనుకోని పరిస్థితులలో వచ్చే ఏడాది పంటలు రాకపోతే అందుకు నిల్వలు. ఇవన్నీ కలిపి 100 శాతం అనుకుంటే ఏయే ప్రాంతంలో ఏవేవి పండుతాయి, ఎంత పండుతాయి అనేదాని ప్రకారం ప్రతి రైతుకు షెడ్యూల్ ఇచ్చి ఉత్పత్తి చేయించాలి) రైతు ఆ పని చూస్తాడు, దానిని ప్రాసెస్; ఫైనల్ గా బియ్యం లేదా గోధుమలు తదితరాలు..వినియోగదారులకు చేర్చడం. ఇవన్నీ చేయడానికి ప్రతి చోట మానవ వనరు మాత్రమే వినియోగిస్తే ఉద్యోగ కల్పన వంద కోట్లు సాధ్యమే.


జనాభా ఉన్న చోట జనానికి ఉపాధి కలిపించాలి గాని యంత్రాలకు కాదు.  అవికూడా ఉపయోగిస్తాం, ఎక్కడైతే మానవ వనరు కు అత్యంత ప్రమాదమో అక్కడ మాత్రమే. వ్యవసాయంలో ప్రమాదం ఏముంది, ఇక్కడ యంత్రాలతో పనేమిటి! ఇలా ప్రతి అత్యవసరం లో మానవ వనరు మాత్రమే ఉంటె విద్యుత్తుతో నడిచే యంత్రాల వలన ఆ వినియోగం తగ్గుతుంది, వాటివలన వెలువడే కాలుష్యం లేదా వేడి వాతావరణం లోకి విడుదల కాకుండా ఉంటుంది. ఇలా ప్రతి దానికి పరిష్కారం ఆలోచించి దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తాను.. అనే నమ్మకం మీకు రావట్లేదా..! మీరు నాతో కలిసి ఆలోచించారు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: