ఆర్కే రోజా.. నమ్మకమైన సమర్థవంతమైన నేత అన్న విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తన మాటల తూటాలతో విపక్షాన్ని ఇరుకున పెట్టే రోజాకు ఇప్పుడు తన సొంత పార్టీ నేత‌ల నుంచి సెగ‌ల పొగ‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆమెకు రాజకీయంగా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. పార్టీలో త‌న‌ను ఇబ్బంది పెట్టేలా వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో రోజాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

అస‌లు ఇప్పుడు రోజా కు ఆమె సొంత నియెజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో ప్ర‌ధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాదు.. ఆమె సొంత పార్టీ నేతలే అన్న‌ట్టుగా అక్క‌డ రాజ‌కీయం న‌డుస్తోంది. ఎన్నో క‌ష్ట‌నష్టాల‌ను ఎదుర్కొన్న రోజా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస గారెండోసారి విజయం సాధించారు. పేరుకు మాత్ర‌మే ఆమె ఓ నియోజ‌క‌వర్గానికి ఎమ్మె ల్యేగా ఉన్న‌ట్టు ఉంటారు. కానీ ఆమెకు రాష్ట్ర స్థాయిలో మంత్రుల‌కు కూడా లేని క్రేజ్ ఉంద‌న్న‌ది వాస్త‌వం. ఇదే ఇప్పుడు ఆమెకు సొంత పార్టీలోనే కొంద‌రికి కంట గింపుగా మార‌డానికి కార‌ణ మైంది.

రోజా ఏం మాట్లాడినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జ‌నాల్లోకి సులువుగా వెళ్లి పోతుంది. రోజా ఎప్పటికప్పడు జగన్ మీద వచ్చే విమర్శలను చాలా స‌మ‌ర్థ‌వంతం గా తిప్పికొడుతుంటారు. ఓ వైపు జిల్లాలో ఆమెకు మంత్రి పెద్దిరెడ్డి తో పాటు ఆమె అనుచ‌రుల నుంచి బ్రేకులు ప‌డుతున్నాయి. ఇక మ‌రో మంత్రి నారాయ‌ణ స్వామి కూడా రోజా నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతున్న ప‌రిస్థితి. ఇక తాజాగా  ఎంపీపీ ఎన్నికల్లోనూ రోజుా మాట చెల్లుబాటు కాలేదు. పైగా రోజా త‌న సొంత సామాజిక వ‌ర్గం నేత‌ల‌తోనే గొడ‌వ‌కు దిగుతున్నారు.

ఈ ప‌రిణామాల‌పై ఆమెకు జ‌గ‌న్ కు కంప్లైంట్ చేసినా ప‌ట్టించు కోక‌పోవ‌డంతో రోజా జ‌గ‌న్ తీరును జీర్ణించు కోలేక పోతున్నార‌ట‌. పైగా ఆమె ను కొంద‌రు తిరిగి టీడీపీలోకి వెళ్లాల‌ని.. అక్క‌డే మీకు గౌర‌వం ఉంద‌ని చెపుతున్నారు. మ‌రి రోజా అంత స‌డెన్ డెసిష‌న్ తీసుకుంటారా ? అన్న‌ది డౌటే ?

మరింత సమాచారం తెలుసుకోండి: