అందుకే ఈ మధ్య పవన్ కల్యాణ్ కూడా దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడూలేని విధంగా పవన్ దూకుడుగా....వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అలా అని మరో ప్రత్యర్ధి పార్టీగా ఉన్న టిడిపిపై విమర్శలు చేయడం లేదు. దీని బట్టి చూస్తే పవన్....టిడిపికి అనుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. అలాగే వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ని తిడితే...మిత్రపక్షంగా ఉన్న బిజేపి నేతలు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ టిడిపి నేతలు స్పందిస్తూ పవన్ కల్యాణ్‌కు మద్ధతుగా మాట్లాడుతున్నారు.
ఈ పరిస్తితిని బట్టి చూస్తే టిడిపి-జనసేనల పొత్తు ఖాయమని అర్ధమైపోతుంది. అయితే ఈ పొత్తు 2024 ఎన్నికల ముందు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు ఇలా పరోక్ష సహకారంతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేనని మరింత బలోపేతం చేసుకోవాలని పవన్ ప్రయత్నించడం మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
అలాగే జనసేనకు పొత్తులో భాగంగా దక్కే సీట్లపైనే గురి పెట్టి, ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలని జనసేనలోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి, బిజేపిల్లో ఉన్న బలమైన నాయకులని తమ వైపుకు తిప్పుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే వంగవీటి రాధా...జనసేన వైపు రావొచ్చని ప్రచారం జరుగుతుంది. అటు గంటా శ్రీనివాసరావుని కూడా లాగేసి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బిజేపి నుంచి కామినేని శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజులని జనసేనలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ రాజకీయం ఎలా ఉంటుందో?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి