తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ విష‌యంలో అయినా నాన్చుతూ నాన్చుతూ వ‌స్తూ ఉంటారు. టిక్కెట్ల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి పార్టీ నేత‌ల‌కు ఏదైనా ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలోనూ ఆయ‌న ఏదీ ఒక ప‌ట్టాన తేల్చ‌రు. 2009 ఎన్నిక‌ల్లో పార్టీ చాలా చోట్ల ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సీట్ల ఎంపిక‌లో చేసిన త‌ప్పిదాలే అని చాలా మంది అంటారు. అంత ఎందుకు ?  గ‌త ఎన్నిక‌ల లోనూ పార్టీ అధికారం లో ఉండి కూడా టిక్కెట్ల కేటాయింపు నుంచి మ‌నీ పంపిణీ .. చివ‌ర‌కు పోల్ మేనేజ్ మెంట్ వ‌ర‌కు బాబు అన్ని విష‌యాల్లోనూ ఆల‌స్యం చేశారు. మ‌రో వైపు ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా వైసీసీ ఈ విష‌యంలో దూసుకు పోయింది. ఫ‌లితంగానే టీడీపీ పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత‌గా ఘోరంగా ఓడిపోయింది.

అయితే ఇప్పుడు చంద్ర‌బాబు ఈ విష‌యంలో మ‌రోసారి పొర‌పాట్లు చేస్తే పార్టీ ఇక ఇప్ప‌ట్లో కోలు కోలేద‌న్న విష‌యాన్ని గ్ర‌హించి న‌ట్టే ఉన్నారు. అందుకే పార్టీ ఇన్ చార్జ్ ల ఎంపిక‌తో పాటు ఇత‌ర ప‌ద‌వుల్లో ఆయ‌న యాక్టివ్ గా ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాలు ఉన్నా కూడా వాటిని ఇప్ప‌టి నుంచే భ‌ర్తీ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి నుంచే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జ్ ల‌ను పెడితే వారు రెండున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటార‌ని.. అది పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌ని బాబు భావిస్తున్నారు.

ఈ రెండు న్న‌ర సంవ‌త్స‌రా ల‌లో ఎవ‌రు అయితే ప్ర‌జ‌ల్లో ఉండి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేస్తారో ?  వారికే సీట్లు ఇవ్వాల‌ని కూడా బాబు ప్రాథ‌మికంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇక పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎప్ప‌టి క‌ప్పుడు ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రి ప‌ని తీరు ఎలా ఉంటోంది ? అనే దానిపై నివేదిక‌లు తెప్పించు కుంటున్నారు. వీటి ఆధారంగానే బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లే కేటాయిస్తార‌ని తెలుస్తోంది. అందుకే బాబులో ఈ కొత్త మార్పు ఇప్పుడు తెలుగు త‌మ్మ‌ళ్ల‌లో మాంచి జోష్ నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: