డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వచ్చే డబ్బుకు ఎవరి రికమండేషన్ అక్కర్లేదని. లోన్ల కోసం ఎవరికీ లంచం ఇవ్వనక్కర్లేదని తెలిపారు మంత్రి  పేర్ని నాని. అక్కచెల్లెమ్మల పరపతితోనే ఆసరా లోన్లు ఇస్తున్నామని.. డ్వాక్రా సంఘాలు బ్రతుకుతున్నది బ్యాంకుల మీదే అనుకోవడం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.  బ్యాంకులు నడిచేది డ్వాక్రా సంఘాలు కట్టే అప్పులు, వడ్డీలతోనే..  ఈ వడ్డీల తో పెద్దోళ్లకు వేలకోట్లు బ్యాంకులు లోన్లు ఇస్తాయని స్పష్టం చేశారు మంత్రి  పేర్ని నాని.  మన ఊర్లో కూడా ఓ ఎంపీకి ఏడువేల కోట్లు లోను ఇచ్చారని... గతంలో అప్పులు తీరుస్తామన్న వ్యక్తి గెలిచిన తర్వాత మోసం చేశాడని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లో వైసీపీ పార్టీ తోనే అభివృద్ధఙ జరుగుతుందని స్పష్టం చేశారు పేర్ని నాని. 
 
జగన్ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారని... దేశంలో ఇందిరాగాంధీ తర్వాత పేదలకు ఇళ్లిచ్చిన నాయకుడు జగన్ మాత్ర మేని కొని యాడారు మంత్రి  పేర్ని నాని.  అనంతరం వైసీపీ నేత తలశిల రఘురాం మాట్లాడుతూ..   టీడీపీ చేసిన పాపాలకు ఫలితం మేం అను భవిస్తున్నామని... జగన్ పేరు వినలేక కొంతమంది గొల్లపూడిలో ఇబ్బంది పడుతున్నట్లుందన్నారు.  గొల్లపూడిలో ఇక పై నిత్యం జగ న్ నామ స్మరణ జరిగి తీరుతుందని.. జగన్ పేరు వినడం ఇష్టంలేని వాళ్లు గొల్లపూడి వదిలి బయటికిపోవచ్చని వెల్ల డించారు.


గతంలో గొల్లపూడిలో 200 కోట్ల అవి నీతి జరిగిందని.. ఈ అవినీతి కి సంబంధిం చిన కొంచెం డాటా ఇప్పటికే కలె క్టర్ కు అందజేశామన్నారు.  మిగిలిన డాటా కూడా త్వరలోనే ఇస్తా మని.. 200 కోట్ల అవినీతి పై కలె క్టర్  విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు మరియు అన్ని కులాల ప్రజలకు నష్టం వాటిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: