విజయవాడ ఎంపీ కేశినేని నానీ పార్టీ మారిపోయే అవకాశం ఉందనే ప్రచారం రెండు రోజుల నుంచి బాగా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆయన పార్టీ మారితే విజయవాడ టీడీపీ కి దిక్కు ఎవరు అంటూ కొన్ని మీడియా చానల్స్ కథనాలు కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. అయితే కేశినేని భవన్ లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు బాగా చర్చకు వస్తున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కేసినేని నాని… వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసారు.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిల నియామకం పై నాని అసంతృప్తి వ్యక్తం చేసారని అంటున్నారు. చంద్రబాబు నివాసం పై దాడి జరిగిన సమయంలో కూడా దూరంగా ఉన్న కేశినేని నాని... మనసులో ఉన్న ఆలోచన పార్టీ నేతలకు అర్ధం కావడం లేదు.  కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోలు నియోజకవర్గ ఇన్చార్జి లో ఫోటోలు తొలగింపు లో  నాని ఆంతర్యమేమిటో తెలీక టీడీపీ శ్రేణులు తర్జనభర్జనలు పడుతున్నారు. కేశినేని భవన్ లో నేడు ఎంపి వర్గీయులు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా చర్చ జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీడీపీ మైనారిటీ నాయకుడు ఫతువుల్లా మాట్లాడుతూ కేసినేని భవన్ లో చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించలేదు అని స్పష్టం చేసారు. కేశినేని భవన్ లో ఒక చోట రతన్ టాటా తో నేని ఉన్న ఫోటో మాత్రమే ఏర్పాటు చేసాము అని వివరించారు. కేశినేని భవన్ చుట్టూ చంద్రబాబు, నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి అని వివరించారు. టాటా ట్రస్ట్ సేవల గుర్తింపు గానే లోపల ఒక ఫోటో ఏర్పాటు చేసామని తెలిపారు. రతన్ టాటా ట్రస్ట్ తో కలిసి చేసే సేవలు మరింత విస్తరిస్తున్నాం అని పేర్కొన్నారు. పార్టీ లు మారతారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. పార్లమెంట్ కమిటీ మీటింగ్ ల కోసం ఎంపీ ఢిల్లీ వెళ్లారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: