ఎన్ కౌంటర్ లతో సహచరులను కోల్పోయి సతమతమవుతున్న మావోయిస్టులను కరోణ కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. అడవుల్లో అగ్రనేతలు ఒక్కొక్కరుగా నేల రాలుతుండడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. హరి భూషణ్ మొదలు మొన్నటి ఆర్కే వరకు దండకారణ్యంలో కరోనాతో చనిపోయినవారే. అగ్రనేతలు చనిపోవడం తమకు తీరని లోటు అంటుంది మావోయిస్టు పార్టీ. కరోణ బారినపడి మావోయిస్టులు తాత్కాలిక వైద్యం పొందినవారు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దండకారణ్యం లోకి వెళ్ళిన వైద్యబృందం  ఇంజక్షన్లు, మందులు, యాంటీబయాటిక్స్ తీసుకొని వెళ్లి వైద్యం చేయించినట్లు పార్టీ ప్రకటించింది. అప్పుడు అందరూ సేఫ్ అని భావించినప్పటికీ ఇటీవల ఒక్కొక్కరికి అగ్రనేతలు అసువులు బాస్తుండడంతో పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరోణ బారినపడిన మధుకర్  అస్వస్థతకు గురికావడంతో పార్టీ నాయకత్వం అతన్ని వరంగల్ ఆస్పత్రికి తరలించింది. ఆయన చికిత్స కోసం వస్తున్న సమాచారం పోలీసులకు అందింది. నిఘా వేసి మధుకర్ ను పోలీసులు పట్టుకున్నారు.

అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో పార్టీలో చాలామంది కరోనా బారిన పడ్డట్లు సమాచారమిచ్చాడు. మదుకర్ కు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించి, ఉస్మానియాకు తరలించాగా చికిత్స పొందుతూ మరణించాడు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు వస్తే మెరుగైన వైద్యం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. దీంతో తమ నాయకులందరూ కోలుకున్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కానీ జూన్ నుంచి కరోణ కారణంగా అగ్ర నాయకులను  కోల్పోతుంది మావోయిస్టు పార్టీ. తెలంగాణ సరిహద్దులోని పామెడ, కొండపల్లి ప్రాంతంలో ఆదివాసీలు,దళ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. దళంలో వందలాది మంది మావోయిస్టులు, పదుల సంఖ్యలో అగ్రనేతలు కరోణతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. చతిస్గడ్ తో పాటు మావోయిస్టులకు పట్టున్న 5 రాష్ట్రాల్లో  కరోనా అత్యంత ప్రమాదకరంగా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో మావోయిస్టు పార్టీ కూడా డాక్టర్లతో ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: